Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

Advertiesment
Teacher

సెల్వి

, మంగళవారం, 29 జులై 2025 (12:14 IST)
Teacher
ప్రభుత్వ ఉపాధ్యాయులకు పని తక్కువ చేస్తారనే టాక్ వుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఏదో పని కానిచ్చేసి సమయాన్ని వృధా చేస్తారనే ఆరోపణలు ఎన్నెన్నో వున్నాయి. ఈ ఆరోపణలు నిజం అనేలా.. ప్రభుత్వ టీచర్.. సంతకం చేశామా.. జీతం తీసుకున్నామా అనే స్టైల్‌‌లో వున్నాడు. 
 
అయితే అతనికి పెట్టిన పరీక్షలో అతను చిక్కుకున్నాడు. అధికారులు స్కూల్ తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో ఈ ఉపాధ్యాయుడిని ELEVEN అనే పదం రాయమని కోరారు. కానీ ఆ పదాన్ని రాయలేక పట్టుబడ్డాడు. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ.70,000 జీతం తీసుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు, అధికారుల తనిఖీ సందర్భంగా 'ELEVEN' అనే ఆంగ్ల పదం స్పెల్లింగ్‌ను సరిగ్గా రాయలేకపోయాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత కఠినమైన పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?