Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఛాన్స్ పేరుతో యువతిపై అత్యాచారం... స్నేహితులకు కూడా పడకసుఖం

Chennai
Webdunia
బుధవారం, 21 జులై 2021 (08:23 IST)
సినిమా అవకాశాల పేరుతో ఓ యువతి మోసపోయింది. వెండితెరపై తనను తాను చూసుకోవాలన్న కోరికను ఆసరాగా తీసుకున్న ఓ కామాంధుడు... ఆ యువతితో శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత అయినా సినీ అవకాశం ఇప్పించాడా అంటే అదీలేదు. పైగా, తన స్నేహితులకు కూడా ఆ యువతితో పడక సుఖం ఇప్పించాడు. ఈ దారుణం చెన్నైలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌ జిల్లాకు చెందిన ఓ యువతి(24) చెన్నై సాలిగ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ మూడేళ్లుగా సినిమా అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈమెకు అడయార్‌కు చెందిన గణేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
 
ఆ యువతికి ఉన్న సినిమా బలహీనతనకు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తనకు అనేక మంది సినీ దర్శకులు తెలుసని, త్వరలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అతని స్నేహితులకు సైతం ఆ యువతితో పడక సుఖం ఇప్పించాడు. 
 
రోజులు గడిచిపోతున్నప్పటికి సినీ అవకాశం మాత్రం ఇప్పించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి... తనపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం విచారణ కోసం పోలీసు స్టేషన్‌ రావాల్సిందిగా యువతిని మహిళా పోలీసులు కోరారు. దీంతో యువతి తన స్నేహితుడితో కారులో వెళ్లింది.
 
వడపళని సమీపంలో వెళుతుండగా యువతి హఠాత్తుగా స్పృహ తప్పింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. తన మృతికి గణేష్‌ కారణమని తెలుపుతూ బ్యాగులో లేఖ దొరికింది. ఈ ఆత్మహత్యాయత్న విరుగంబాక్కం పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం