Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాక్వ‌లైన్ కోసం ప్ర‌త్యేక విమానం - పాట కోసం ఐదు కోట్లు

Advertiesment
జాక్వ‌లైన్ కోసం ప్ర‌త్యేక విమానం - పాట కోసం ఐదు కోట్లు
, మంగళవారం, 20 జులై 2021 (17:59 IST)
Jacqueline, Sudeepa
సుదీప్ న‌టిస్తున్న `విక్రాంత్ రోణ` షూటింగ్‌కు చిత్ర నిర్మాత‌లు జాక్వలైన్ ఫెర్నాండెజ్ ను ప్ర‌త్యేక విమానంతో తీసుకువ‌చ్చారు. హీరో పాత్ర‌కు స‌మానంగా ఆమె వుంటుంది. 300 డాన్స‌ర్స్ తో ఆరు రోజుల పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఈ పాట కోసం భారీ సెట్‌ను వేశారు. జానీ మాస్ట‌ర్ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. జాక్వలైన్ న‌టించిన పాట‌, స‌న్నివేశాల కోసం నిర్మాత‌లు ఐదు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టార‌ని చిత్ర యూనిట్ మంగ‌ళ‌శారంనాడు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’.ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ చాలా గ్రాండ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ గ్రాండియ‌ర్‌ను కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ‘విక్రాంత్ రోణ‌’ చిత్రంలో ఈ బాలీవుడ్ భామ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇది అభిమానుల‌కు స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అవుతుంద‌ని మేక‌ర్స్ తెలిపారు 
 
రీసెంట్‌గా కొన్ని నెల‌ల క్రితం దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా భ‌వంతిలో బాద్‌షా కిచ్చా సుదీప్ న‌టుడిగా త‌న 25 వ‌సంతాల వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన వివ‌రాల‌తో పాటు ‘విక్రాంత్ రోణ‌’ సినిమా సినిమా లోగోను క‌లిపి 180 సెక‌న్ల స్నీక్ పీక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ అడుగుపెట్ట‌డం అనేది అందరిలో ఎక్సైట్‌మెంట్‌ను తీసుకొచ్చింది.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ, మా సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది అభిమానుల‌కు, ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజింగ్‌గా, వారిని థియేటర్స్‌కు ర‌ప్పించేలా ఉంటుంది. జాక్వలైన్ చాలా ప్రొఫెష‌న‌ల్ న‌టి. క‌చ్చిత‌మైన స‌మయానికి షూటింగ్‌కు వ‌చ్చేవారు. ఉద‌యం 9 గంట‌ల‌కు సెట్స్‌కు వ‌చ్చి రాత్రి 9.30 నిమిషాల‌కు వ‌ర‌కు ఉండేవారు. షూటింగ్‌కు వ‌చ్చే ముందు ఆమెకు సంబంధించిన డైలాగ్స్‌ను రిహార్స‌ల్ చేసి వ‌చ్చేవారు. చాలా డేడికేష‌న్‌తో వ‌ర్క్‌ను పూర్తి చేశారు. ఆమె పాత్ర‌కు ఆమె డ‌బ్బింగ్ చెబుతాన‌ని తెలిపారు’’ అన్నారు. 
 
డైరెక్ట‌ర్ అనూప్ భండారి మాట్లాడుతూ, జాక్వ‌లైన్ భాగం కావ‌డం అనేది క‌థ‌లో మ‌రో కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. ఈ ప్ర‌పంచానికి స‌రికొత్త హీరోగా ‘విక్రాంత్ రోణ‌’ ప‌రిచ‌యం అవ‌బోతున్నాడు. ఈ సినిమాలోకి ఆమెను సగౌర‌వంగా స్వాగ‌తిస్తున్నాం. ఇలాంటి స్టార్స్ మా సినిమాలో ఉండ‌టం అనేది మాకు కూడా ఎగ్జ‌యిటింగ్‌గానే ఉంది. అలాగే ఈ సినిమాలో విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది’’ అన్నారు.  
 
జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, `విక్రాంత్ రోణ‌` సినిమా చాలా స్పెష‌ల్ మూవీ. ఈ ప్ర‌పంచానికి ప్ర‌త్యేక‌మైన భార‌తీయ క‌థ‌ను ఈ సినిమా ద్వారా తెలియ‌జేయ‌బోతున్నారు. ఈ భారీ రేంజ్‌లో రూపొందుతోన్న‌ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌లో నేను భాగం కావ‌డాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థియేట‌ర్స్‌కు ఓ స్ఫూర్తినిచ్చే చిత్ర‌మిదవుతుంద‌ని నేను భావిస్తున్నాను’’ అన్నారు.
 
బాద్‌షా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ‘‘మేం సినిమాను ఎలాంటి ఉత్తేజంతో స్టార్ట్ చేశామో అదే ఉత్తేజంతో పూర్తి చేయాల‌నుకుటున్నాం. మా ఎంటైర్ టీమ్ పాజిటివ్ దృక్ప‌థంతో ముందుకెళుతుంది. అంద‌రికీ థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో భాగ‌మై పాట‌, సినిమా స‌హా మా అంద‌రిలో ఓ ఎన‌ర్జీకి కార‌ణ‌మైన జాక్వ‌లైన్‌గారికి ధ‌న్య‌వాదాలు. మీ డాన్స్ నాలోని ఎన‌ర్జీని రెట్టింపు చేసింది. ఇలాగే మీరు ఆత్మీయానుభూతిని పంచాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
బాహు భాషా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీగా ప‌లు భాష‌ల్లో రూపొందుతోన్న ‘విక్రాంత్ రోణ‌’ త్రీడీలో 14 భాష‌లు, 55 దేశాల్లో విడుద‌ల‌వుతుంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్ (షాలిని ఆర్ట్స్‌) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్ (ఇన్‌వెనో ఫిలింస్‌) స‌హ నిర్మాత. బి.అజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.జి.య‌ఫ్ ఫేమ్ శివ‌కుమార్ భారీ సెట్స్ వేశారు. అలాగే విలియ‌మ్ డేవిడ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కిచ్చా సుదీప్‌, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పెర్‌ఫార్మెన్స్ చూడండంటున్న హిమ‌జ‌