Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రయాన్-3' ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (10:19 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో బృహత్తర ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 14వ తేదీన "చంద్రయాన్-3" ప్రయోగం చేపట్టనుంది. ఇప్పటికే చేపట్టిన తొలి రెండు దఫాల 'చంద్రయాన్' ప్రయోగాలు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో మూడోసారి మాత్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రయోగం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 
 
ఇందుకోసం 'చంద్రయాన్-3' ప్రయోగానికి మూహూర్తం ఖరారు చేసింది. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3లో భాగంగా జీఎస్ఎల్వీ-ఎంకే 3 లేక ఎల్వీమ్ 3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్ సెంటర్) సన్నద్ధమవుతోంది. 'చంద్రయాన్-2'లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉండగా... చంద్రయాన్-3లో ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్‌ను పొందుపరిచారు.
 
'చంద్రయాన్-2'లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో విఫలమైన నేపథ్యంలో, అనేక మార్పులు చేర్పులతో 'చంద్రయాన్-3' ల్యాండర్‌‌లో అభివృద్ధి చేశారు. విక్రమ్ ల్యాండర్‌కు బలమైన కాళ్లు అమర్చారు. అత్యధిక వేగంగా దిగినప్పటికీ దెబ్బతినని రీతిలో ల్యాండర్‌కు రూపకల్పన చేశారు. ఇంజిన్, సెన్సర్, థ్రస్ట్ వైఫల్యాలను గుర్తించి చక్కదిద్దేందుకు అధునాతన సాఫ్ట్ వేర్ ఉపయోగించనున్నారు. 
 
'చంద్రయాన్-2' నుంచి నేర్చుకున్న గుణపాఠాల నేపథ్యంలో, 'చంద్రయాన్-3'లో సెంటర్ ఇంజిన్ లేదా ఐదో ఇంజిన్‌ను తొలగించనున్నారు. ఇక, విక్రమ్ లాండర్ చంద్రుడిపై సూర్యరశ్మి సోకని ప్రాంతంలో ల్యాండైనప్పటికీ ఇంధన శక్తిని పొందేందుకు వీలుగా మరిన్ని సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments