Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి క్షణంలో తప్పు చేశాం... చంద్రయాన్‌-2పై ఇస్రో ఛైర్మన్

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (10:45 IST)
చంద్రయాన్-2 ప్రాజెక్టుపై ఇస్రో ఛైర్మన్ శివన్ నాయర్ స్పందించారు. చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అనుకోని రీతిలో మొరాయించిందనీ అందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. చంద్రయాన్ -2 ప్రయోగం తీరు తెన్నులపై స్పందించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైందన్నారు. చంద్రుని ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అనుకోని రీతిలో మొరాయించిందని, లేకుంటే చంద్రయాన్-2 ద్వారా భారత కీర్తిపతాక విశ్వవీధిలో మరోసారి రెపరెపలాడేదని తెలిపారు. 
 
ఈ ప్రయోగం తీరుతెన్నులపై ఇస్రో ఛైర్మన్ శివన్ స్పందించారు. మీడియా ముందుకొచ్చిన ఆయన ఈ ప్రక్రియ చివరి నిమిషాల్లో తమ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందన్నారు. 
 
చివరి దశ తాము అనుకున్న విధంగా సాగలేదని, విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments