చంద్రయాన్ 3 విఫలమైంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ఉన్న ఊహించని సమస్య ఎదురైంది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అనుకునేలోపే.. విక్రమ్ నుంచి కమాండ్ కంట్రలో రూమ్‌కి సంకేతాలు నిలిచిపోయాయి.
విక్రమ్ ల్యాండింగ్‌లో ఆఖరి 15 నిమిషాలు కీలకంగా, క్లిష్టంగా మారాయి. అందుకు తగ్గట్లే చివరి క్షణాల్లో విక్రమ్‌కు అవాంతరయాలు ఎదురయ్యాయని ఇస్రో అధికారులు తెలిపారు. ఆ 15 నిమిషాల్లో 14 నిమిషాల పాటు సజావుగా సాగిన విక్రమ్ ప్రయాణం.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది.
విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. కానీ తొలుత రఫ్ బ్రేకింగ్ అంచెను సక్సెస్ చేశారు. తర్వాత ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది.
అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడింది.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి.
సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి గమ్యానికి చేరువలో గతి తప్పింది.