Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షల షెడ్యూల్ విడుదల: ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (20:25 IST)
సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. టర్మ్-1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 
 
12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక ముందు ఎవరినీ కూడా పాస్ చేయబోమని స్పష్టం చేసింది.
 
గ‌త ఏడాది జూలైలో ప్రక‌టించిన ప్యాటర్న్‌ ప్రకార‌మే ట‌ర్మ్-2 ప‌రీక్షలు జ‌రుగుతాయి. ఈ నేపథ్యంలో ఈసారి బోర్డు పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగవని వెల్లడించింది. 
 
జేఈఈ మెయిన్స్ వంటి ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. సుమారు 35 వేల సబ్జెక్టులు ఉండటంతో ఏ రెండు సబ్జెక్టుల పరీక్షలు ఒకే రోజు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments