Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే కాదు.. కామాంధుడు.. వితంతువుపై అత్యాచారం

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (13:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఓ ఎమ్మెల్యే కామాంధుడుగా మారిపోయాడు. ఓ వితంతువుపై అత్యాచారం తెగబడ్డాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌గఢ్ శాసనసభ స్థానం నుంచి 77 ఏళ్ళ  జోహారీ లాల్ మీనా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన పలుమార్లు ఓ వితంతువుపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై ఐపీసీ 376 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  
 
తన వ్యక్తిగత పనుల కోసం ఎమ్మెల్యేలను కలిసేందుకు ఓ మహిళ రెండేళ్ళ క్రితం వెళ్లింది. అపుడు శీతలపానీయంలో మత్తుమందు కలిపి తొలిసారి అత్యాచారం చేయగా, ఆ తర్వాత పలుమార్లు అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ ఆరోపిస్తోంది. 
 
ఈ క్రమంలో 2019, మార్చి 24వ తేదీన మళ్లీ తన ఇంటికి వచ్చి ఎమ్మెల్యే మీనా తనపై అత్యాచారం చేశాడని బాధిత వితంతువు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ అధికారులు నిందితుడైన ఎమ్మెల్యే మీనాపై ఐపీసీ 328, 384, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments