Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

100 మందిని రేప్ చేసి 40 ఏళ్లకు దొరికాడు.. ఎక్కడ?

100 మందిని రేప్ చేసి 40 ఏళ్లకు దొరికాడు.. ఎక్కడ?
, గురువారం, 18 ఏప్రియల్ 2019 (17:07 IST)
ఏడు పదుల వయస్సున్న వృద్ధుడుప 100 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో అదెలా సాధ్యమని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే అసలు విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అతను అత్యాచారం చేసింది ఇప్పుడు కాదట దాదాపు 40 ఏళ్ల క్రితమే అంతమందిని అత్యాచారం చేసాడట. 
 
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట సదరు వ్యక్తి చేతిలో అఘాయిత్యానికి గురైన మహిళలంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అమెరికాలోని లూసియానాలో ఈ సంఘటన స్థానికంగా సంచలనం అయింది. 
 
లూసియానాలోని పైన్‌విల్లేలో నివాసం ఉంటున్న 71 ఏళ్ల హార్వే ఫౌంటేన్ అనే వ్యక్తిపై ఈమధ్యే ఒక అత్యాచార కేసు నమోదైంది. 1970 దశాబ్దంలో తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ముందుకు రావడంతో వారి లెక్క దాదాపు 100 మందికి పైగా ఉన్నట్లు తేలింది.
 
నలభై ఏళ్ల క్రితం హార్వే ఫౌంటేన్ తన ఇంటి పక్కనే ఉంటున్న స్కూల్‌లో ఆడుకుంటున్న పిల్లలతో స్నేహం ఏర్పరచుకునేవాడు. 13 ఏళ్ల పిల్లలకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి, అత్యంత పైశాచికంగా అత్యాచారం చేసేవాడు. 
 
ఆ వయసులో హార్వే చేసిన పనిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తమలో తామే కుమిలిపోయారు ఆ అమ్మాయిలు. అది జరిగిన దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1, 2019న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసుల హార్వే ఫౌంటేన్‌ను అరెస్ట్ చేశారు. 
 
అయితే ఆశ్చర్యకరంగా హార్వేను అదుపులోకి తీసుకున్న తర్వాత మరో వంద మంది మహిళలు ముందుకు వచ్చి, అతనిపై మరిన్ని రేప్ కేసులు పెట్టారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. లూసియానా రాష్ట్ర చట్టాల ప్రకారం మైనర్‌పై అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష విధిస్తారు. 40 ఏళ్ల క్రితం చేసిన జరిగిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నాడు హార్వే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ అత్యాచారం చేసినా ఎటువంటి శిక్ష ఉండదట