Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాలి బ్యాచ్‌కు కాంగ్రెస్‌ ప్రాధాన్యం : ప్రియాంకా చతుర్వేది

గాలి బ్యాచ్‌కు కాంగ్రెస్‌ ప్రాధాన్యం : ప్రియాంకా చతుర్వేది
, శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (12:36 IST)
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది తేరుకోలేని షాకిచ్చారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆరోపించిన ఆమె.. గురువారం రాత్రి పార్టీకి రాజీనామా చేశారు. 
 
నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు గాలి బ్యాచ్‌కు ప్రోత్సాహం ఇస్తోందంటూ చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపింది ఈ నేపథ‍్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. మరోవైపు తన ట్విటర్‌లో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ట్యాగ్‌ను తీసివేయడం గమనార్హం. 
 
కాగా కొద్దికాలం క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలు తనపై అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ ప్రియాంక చతుర్వేది పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారిపై వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలన్న ఉద్దేశ్యంతో వారిపై పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సిథియా సస్పెన్సన్‌ను ఎత్తివేసినట్లు ప్రకటించారు.
 
ఇదే అసలు వివాదానికి కారణంగా నిలిచింది. ఈ నిర్ణయంపై ఆమె మండిపడ్డారు. గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. అభ్యంతరకరంగా మాట్లాడి, తనను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీకి రాజీనామా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న జీవీఎల్‌ (బీజేపీ)కు చెప్పుదెబ్బ.. నేడు హార్దిక్‌ (కాంగ్రెస్)కు చెంపదెబ్బ