Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీపై కేసు.. భారత్ జోడో యాత్రలో అపశ్రుతి

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (21:52 IST)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. భారత్ జోడో పాదయాత్రలో కేజీఎఫ్-2 పాటలను వినియోగిస్తున్నారంటూ రాహుల్ గాంధీతో పాటు తదితరులపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా కేజీఎఫ్-2 పాటలపై హక్కులను కలిగివున్న బెంగళూరుకు చెందిన ఎమ్మార్టీ మ్యూజిక్ అనే మ్యూజిక్ ప్లాట్ ఫాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేజీఎఫ్-2 హిందీ వెర్షన్ పాటలపై హక్కులను సొంతం చేసుకునేందుకు తాము భారీ మొత్తంలో చెల్లించామని, అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అనుమతిలేకుండా ఈ పాటలను వాడుకుంటున్నారని ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది.  ఈ భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాహుల్ భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ శివకుమార్ కాలిపై నుంచి రాహుల్ కాన్వాయ్‌లోని వాహనం వెళ్లింది. దీంతో, ఆయన గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments