Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదు : కేంద్రం స్పష్టం

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (10:10 IST)
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదని చెప్పింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విధించిన కోవిడ్ నిబంధనల్లో బలవంతపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎక్కడా లేదని గుర్తుచేసింది.
 
అంగవైకల్యంతో బాధపడుతున్నవారు టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కష్టతరమని, అందువల్ల వారికి వారి ఇంటివద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్చంధ సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోతే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. 
 
దీనిపై విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని ఆ అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదని తేల్చి చెప్పింది.
 
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెబుతుందని, దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్‌‍ఫామ్స్‌ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పింది. ఏ ఒక్కరికీ వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేది వారి వ్యక్తిగత అంశమని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments