Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 36 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (09:14 IST)
హైదరాబాద్ నగరంలో దాదాపు 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఏకంగా 36 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులో ప్రధాన రవాణా సౌకర్యాల్లో ఎంఎంటీఎస్ ఒకటి. అయితే, ట్రాక్ నిర్వహణ కారణంగా మొత్తం 79 సర్వీసుల్లో 36 సర్వీసులను రద్దు చేసింది. 
 
వీటిలో లింగంపల్లి - హైదరాబాద్ మీదుగా నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మధ్య నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య నడిచే రెండు సర్వీసులు ఉన్నాయి. రైల్వే ట్రాక్ పనులు పూర్తయిన తర్వాత అన్ని సర్వీసులను యధావిధిగా పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments