Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి పండించుకోవ‌చ్చు.. కానీ..!

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (19:17 IST)
ఔష‌ధాల్లో వినియోగించుకోవ‌డం కోసం గ‌ంజాయి పండించుకోవ‌చ్చంటూ గోవా న్యాయ‌శాఖ‌ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. వీటిపై అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి.

రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్ర‌తిపాద‌న‌ల‌కు న్యాయ‌శాఖ ఆమోదం తెలిపిన‌ట్లు గోవా న్యాయ శాఖ మంత్రి నీలేష్ కాబ్ర‌ల్ వెల్ల‌డించారు. దీనివ‌ల్ల స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్ర‌గ్‌ను ఫార్మాసూటిక‌ల్ కంపెనీల‌కు విక్ర‌యించ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.

ఈ ప్ర‌తిపాద‌న‌కు గోవా ప్ర‌భుత్వం ఇంకా ఆమోదం తెల‌ప‌లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ చెప్పిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే న్యాయ‌శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

బీజేపీ ప్ర‌భుత్వం పూర్తిగా దిగ‌జారిపోయింద‌ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి అమ‌ర్‌నాథ్ పాంజిక‌ర్ విమ‌ర్శించారు. ఇది పూర్తిగా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఇప్ప‌టికే గోవాలో డ్ర‌గ్స్ వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోయిన వేళ ఈ అనుమ‌తుల వ‌ల్ల మ‌రింత గంజాయి మార్కెట్‌లోకి రానుంద‌ని ఆయ‌న అన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments