Publish Date: Thu, 17 Sep 2020 (06:58 IST)
Updated Date: Thu, 17 Sep 2020 (07:01 IST)
విజయనగరం జిల్లాలోని పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బుధవారం కొమరాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయగడ కు అక్రమంగా లారీలో తరలిపోతున్న గంజాయిని గుర్తించామన్నారు.
కొమరాడ రహదారి వద్ద గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో ఓ లారీలో గంజాయిని గుర్తించామని చెప్పారు. పార్వతీపురం వైపు నుంచి రాయగడ రోడ్డు మీదుగా అక్రమంగా లారీలో తరలిస్తున్న సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.