Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్‌ చేయకపోతే రద్దు ఖాయం!

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:42 IST)
మరో మూడు రోజుల్లో పాన్‌కార్డు రద్దు కాబోతోంది. అందేంటని ఆశ్చర్యానికి గురికాకండి. ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్ చేయకపోతే ఖచ్చితంగా పాన్‌ కార్డు రద్దు అయిపోతోంది. వీటికి గడువు ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది.

ఈలోగా మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింగ్ చేసుకోండి లేకపోతే ఇక అంతేనని.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీబీ) అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత దేశంలో 43 కోట్ల మంది పర్మినెంట్ ఎకౌంట్‌ నెంబర్ (పాన్)ని కలిగిఉన్నారు. వీరిలో 50 శాతం మంది మాత్రమే ఆధార్‌ కార్డుకు పాన్‌ని లింక్ చేశారని అధికారులు చెబుతున్నారు.

నిజానికి ఇది 2019 సెప్టెంబర్ 30వ తేదీ గడువు కాగా గతంలో డిసెంబర్ 31 వరకూ పొడిగించారు.
కాగా.. ముఖ్యంగా ఎన్నారైలు కూడా ఈ నియమం తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ వీటిని అనుసంధానం చేయకపోతే పలు ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.

అనంతరం ఆర్థిక లావాదేవీలకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. పీఎఫ్, హెల్త్ కార్డ్స్ మనీ ట్రాన్స్‌ఫార్స్‌లో ఇవి ఇంకొంత చికాకును కలిగిస్తాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments