Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిలో మొత్తం అస్థికలు కలపవద్దు: సత్యపాల్ సింగ్

గంగానదిలో అస్థికలు కలపడమనేది హిందువుల విశ్వాసమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. గంగానదిలో కాలుష్యాన్ని అరికట్టే నిమిత్తం నదిలో అస్థికలు

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (16:04 IST)
గంగానదిలో అస్థికలు కలపడమనేది హిందువుల విశ్వాసమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. గంగానదిలో కాలుష్యాన్ని అరికట్టే నిమిత్తం నదిలో అస్థికలు మొత్తం కలపవద్దని సత్యపాల్ సింగ్ సూచించారు.

కొన్నిటిని మాత్రమే గంగలో కలిపి, మిగిలిన అస్థికలను నదీపరీవాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి, దానిపై ఓ మొక్కను నాటాలని మంత్రి తెలిపారు. ఇందుకుగాను పురోహితులు, హిందూ ఆధ్యాత్మికవేత్తలు కృషి చేయాలని.. ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు.
 
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో నమామి గంగ ఒకటి. మోదీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోన్న విమర్శలు వచ్చాయి. ఈ పథకం పట్టాలెక్కేందుకు రెండేళ్లు పట్టింది. 
 
మరోవైపు గంగాప్రక్షాళన ప్రాజెక్ట్ కాదు. మన పాపానికి ప్రాయశ్చిత్తం. ఇన్నేళ్లు దాని అస్థిత్వాన్ని కాపాడుకోలేకపోయినందుకు సిగ్గుపడాలని గత ప్రభుత్వాల తప్పిదాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి ఎత్తిచూపారు. గంగా ప్రక్షాళనతో మోక్ష మార్గాన్ని చూపిస్తామని ప్రకటించారు. అయితే కాగ్ మాత్రం గంగ ప్రక్షాళనలో కేంద్రం ప్రభుత్వం నిధులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో విఫలమైందని నివేదికలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments