Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''ప్యారడైజ్ పేపర్స్'' లీకేజీలో బ్రిటన్ క్వీన్.. భారతీయుల గుండెల్లో రైళ్లు..

''ప్యారడైజ్ పేపర్స్'' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పనామా పేపర్స్ లీకేజీ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద డేటా లీకేజీలో ప్యారడైజ్ పేపర్స్ లీకేజీ రెండోదని విశ్లేషకులు అంటున్నారు. ఈ లీక్‌లో బ్రి

''ప్యారడైజ్ పేపర్స్'' లీకేజీలో బ్రిటన్ క్వీన్.. భారతీయుల గుండెల్లో రైళ్లు..
, సోమవారం, 6 నవంబరు 2017 (08:45 IST)
''ప్యారడైజ్ పేపర్స్'' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పనామా పేపర్స్ లీకేజీ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద డేటా లీకేజీలో ప్యారడైజ్ పేపర్స్ లీకేజీ రెండోదని విశ్లేషకులు అంటున్నారు. ఈ లీక్‌లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పేరు కూడా వినిపించడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో క్వీన్ ఎలిజబెత్ ప్రైవేట్ ఎస్టేట్ రహస్యంగా పది మిలియన్ పౌండ్ల (రూ.84 కోట్లు)ను విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్లు ప్యారడైజ్ పేపర్స్ ద్వారా తెలుస్తోంది. పన్నుల నుంచి తప్పించుకునేందుకు వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్ట ప్యారడైజ్ పేపర్స్ వెల్లడించాయి. 
 
ఇంకా పన్నులు ఎగ్గొట్టేందుకు విదేశాల్లో సొమ్ము దాచుకున్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన నైక్, ఫేస్ బుక్ లాంటి సంస్థలతో పాటు బ్రిటన్ రాణి పేరు కూడా ఈ పేపర్స్‌లో ఉండటం కలకలం సృష్టిస్తోంది. క్వీన్ ఎలిజబత్‌తో పాటు మొత్తం 13.4 మిలియన్ పేపర్లు లీకయ్యాయి. ఇందులోని వారందరూ తమ ఆస్తులను విదేశాల్లో అక్రమంగా దాచుకుంటున్నవారేనని పేపర్లు తెలిపాయి. 
 
ఇంకా... న్యాయ సలహాలు అందించే ''అప్లెబీ'' అనే సంస్థకు చెందిన డేటా లీకేజీ 714 మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 180 మంది దేశాలకు చెందిన డేటా లీకవగా అందులో సంఖ్యా పరంగా భారత్ 19 స్థానంలో నిలిచింది. అప్లెబీ ఖాతాదారుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. 714 మంది భారతీయ కుబేరులు పన్ను ఎగ్గొట్టిన వారేనని ఈ లీకేజీ ద్వారా వెల్లడి అయ్యింది. 
 
పెద్ద నోట్లు రద్దు చేసి ఈ నెల ఎనిమిదో తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ‘యాంటీ-బ్లాక్  మనీ డే’ను పాటిస్తోంది. దీనికి రెండు రోజుల ముందే పారడైజ్ పేపర్స్ లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన "నేవిగేటర్ హోల్డింగ్స్''లో అతనికి వాటా ఉన్నట్టు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాపై అణు దాడికి ఉత్తర కొరియా సమాయత్తం...