Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోపాక్ సరిహద్దుల్లో రూ.270 కోట్ల హెరాయిన్ పట్టివేత

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (10:00 IST)
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 270 కోట్ల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇందులో అధికంగా హెరాయిన్ వుంది. దీన్ని పైపుల ద్వారా భారత్‌లోకి  పాకిస్థాన్ స్మగ్లర్లు అక్రమంగా చేరవేస్తున్నట్టు తేలింది. 
 
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. బికనేర్‌లోని కాజూవాలా ప్రాంతంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న పాక్ స్మగ్లర్లు పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను పంపేందుకు ప్లాన్ వేశారు. 
 
ఈ విషయం తెలుసున్న భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) బలగాలు వెంటనే అప్రమత్తమై స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం నిర్వహించిన సోదాల్లో 54 ప్యాకెట్లలో 58.6 కిలోల బరువున్న హెరాయిన్‌ లభ్యమైంది. దీని విలువ రూ.270 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్దమొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడడం ఇదే తొలిసారని బీఎస్ఎఫ్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments