Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

పోషియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ - నలుగురు ఉగ్రవాదుల హతం

Advertiesment
Shopian
, సోమవారం, 22 మార్చి 2021 (11:06 IST)
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 
 
ప్రస్తుతం జవాన్లు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.
 
మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు.
 
భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. 
 
వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు - లాక్డౌన్ తప్పదా?