Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళుతూ నదిలో దూకేసిన నవవధువు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (13:34 IST)
ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేశారో లేక వరుడు నచ్చలేదో తెలియదు గానీ.. పెళ్లి మండపం నుంచి అత్తారింటికి బయలుదేరిన నవ వధువు మార్గమధ్యంలో నదిలో దూకేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని అలాపుర్‌కు చెందిన ఓ యువతికి ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగానే జరిగింది. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని తన అత్తారింటికి నవ వధువు  బయలుదేరింది. అయితే, షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరినా, డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు.
 
ఆ వెంటనే వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తర్వాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments