Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన 2 గంటల్లో వధువు జంప్... బాత్రూమ్ వెళ్ళివస్తానని భర్తకు బురిడీ...

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (19:06 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వివాహమైన రెండు గంటల్లోనే వధువు పారిపోయింది. బాత్రూమ్‌కు వెళ్లేందుకు కారు ఆపి, ఆ తర్వాత పత్తాలేకుండా పారిపోయింది. దీంతో పెళ్లి చేసుకున్న రెండు గంటల్లోనే బిజినెస్ మ్యాన్ అయిన నూతన వరుడు సంతోషం ఆవిరైపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటకకు చెందిన అంకిత్ జైన్ వ్యక్తి ఓ బిజినెస్ మ్యాన్. ఈయన పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేయగా, చివరకు ఓ సంబంధం కుదిరింది. సూరత్‌లో ఉండే సతీశ్ పటేల్ అనే మధ్యవర్తి ఈ సంబంధం తెచ్చాడు. పెళ్లి కూతురు స్వాతీ భట్ ఫోటోలు, ఇతర వివరాలను వాట్సాప్ ద్వారా సతీశ్ అంకిత్‌కు పంపించాడు. స్వాతీ తనకు నచ్చడంతో అంకిత్ వెంటనే పెళ్లికి ఒకే చెప్పేశాడు. 
 
ఈ క్రమంలో పెళ్లి ఖర్చుల కోసం అంకిత్ స్వాతీ భట్ సోదరుడికి రూ.1.5 లక్షలు ఇచ్చాడు. అంతేకాకుండా మధ్యవర్తికి కిమిషన్ కింద రూ.20 వేలు చెల్లించాడు. కాబోయే కోడలికి అంకిత్ తల్లి రూ.20 వేల విలువైన బంగారపు ఉంగరం, వెండి గజ్జెలు, ఓ చీర పెట్టింది. జూన్ 4ను ముహుర్తం పెట్టుకుని అంకిత్, తల్లితో సహా సూరత్ చేరుకున్నాడు. అక్కడి తాపీ నది సమీపంలోని కపోద్రా ప్రాంతంలోగల ఓ దేవాలయంలో ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా వారి వివాహం జరిగింది. 
 
ఆ తర్వాత తన భార్య, తల్లితో కలిసి అంకిత్ బంధువుల ఇంటికి వెళుతుండగా.. మార్గమధ్యంలో కారు ఆపమని స్వాతి అతడికి చెప్పింది. 'స్నాక్స్ ఏమైనా తిని.. బాత్రూమ్‌కు వెళ్లి కాస్త ఫ్రెషప్ అయి వస్తా' అని కారు దిగి వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. వారు ఆ చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 
 
ఆ తరువాత మధ్యవర్తికి ఫోన్ చేస్తే.. 'మీరు వెతుకుతూ ఉండండి.. ఈలోపు నేను పెళ్లికూతురికి సోదరుడికి ఫోన్ చేస్తాను' అని అతడు చెప్పాడు. దీంతో వారు మరికొంత సేపు వెతిక ఆ తర్వాత మళ్లీ మధ్యవర్తికి, పెళ్లికూతుకి సోదరుడికి ఫోన్ చేస్తే వారు లిఫ్ట్ చేయలేదు. దీంతో.. తాము మోసపోయామని అర్థం చేసుకున్న వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments