Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై ఘోరంగా తన్నుకున్న ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి (Video)

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (09:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఓ అమ్మాయి, ఓ అబ్బాయి నడి రోడ్డుపై పిచ్చాపాటిగా తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలోని గోమతి నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దృశ్యాలను పలువురు పాదాచారులు వీడియో తీసి సోషల్ పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. అయితే, వారు ఎందుకు గొడవపడ్డారనేది తెలియరాలేదు. అలాగే, వీరిద్దరూ కూడా స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌‍లో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు. 
 
ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్య ప్రియుడుతో ఉండగా చూసిన భర్త.. తీవ్ర ఆగ్రహంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హర్దోయ్ జిల్లా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 25 యేళ్లు మహిళ.. అదే గ్రామానికి చెందిన తన ప్రియుడుని కలిసేందుకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త రామ్ ఖిలావన్, భార్యను రహస్యంగా అనుసరిస్తూ ప్రియుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య ప్రియుడుతో ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన రామ్ ఖిలావన్, ప్రియుడి ఎదుటే భార్య ముక్కును బలంగా కొరికేశాడు. దీంతో ఆమె ముక్కుకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను హర్దోయ్ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని ఆస్పత్రి తరలించాలని వైద్యులు సూచించారు. 
 
ఈ ఘటనపై అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, నిందితుడైన భర్త రామ్ ఖిలావన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments