Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌పీఎఫ్‌ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి : సీఎం స్టాలిన్

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (18:07 IST)
సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్) ఉద్యోగ నియామక పరీక్ష కేవలం ఇంగ్లీష్‌, హిందీలో నిర్వహించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం లేకపోవడం వివక్ష, ఏకపక్షమని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.
 
'ఉద్యోగ నోటిషికేషన్‌ ప్రకారం అభ్యర్థులు కేవలం ఇంగ్లీష్‌, హిందీలోనే పరీక్ష రాయాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం లేకుండా పోతోంది. ఇది ఏకపక్షంగా ఉండటమే కాకుండా వివక్ష చూపించడమే' అని అమిత్‌ షాకు రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు.
 
ఈ రకమైన పరీక్ష నిర్వహణతో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగానికి దూరం అవుతారని.. ఇది ఔత్సాహికుల రాజ్యాంగ హక్కుకు వ్యతిరేకమని ఎంకే స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని, తమిళంతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
 
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 9212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు చివరి తేదీ ఏప్రిల్‌ 25. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments