ఆర్కే నగర్ బై పోల్ ... గెలుపు ఆయనదే : స్వామి జోస్యం

చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌ విజయం సాధించడం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు.

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (16:05 IST)
చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌ విజయం సాధించడం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. ఆ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో దినకరన్‌ గెలిచి డీఎంకే నేత స్టాలిన్‌కు గుణపాఠం చెబుతారన్నారు. దినకరన్‌కు, డీఎంకేకు అధికార పార్టీ అస‌లు పోటీనే కాద‌ని చెప్పారు. 
 
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి పనులు చేయలేదని, వారిద్ద‌రూ అసమర్థులని అన్నారు. డీఎంకే పార్టీ హిట్లర్‌ పార్టీ అని, దాని నుంచి దిన‌క‌ర‌న్ మాత్ర‌మే ప్రజలను కాపాడగల‌డ‌ని అన్నారు.
 
కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఈ.మధుసూదనన్ పోటీ చేస్తుండగా, డీఎంకే తరపున మరుద గణేష్, స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌తో పాటు.. మరికొంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెల్సందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments