Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే బట్టలూడదీసి ఉరికించి కొట్టిన రైతులు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (14:48 IST)
కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై దేశంలోని రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిగిపోతున్నారు. ఈ చట్టాల రద్దు కోసం గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై రైతులు మండిపడుతున్నారు. చేతికి చిక్కిన ఎమ్మెల్యేలను వెంటపడమరీ కొడుతున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై రేతులు విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఎమ్మెల్యే బట్టలూడదీసి ఉరికించి ఉరికించి కొట్టారు. రైతుల దెబ్బలకు తాళలేక ఎమ్మెల్యే ప్రాణ భయంతో పరుగు తీశాడు. పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లో తాజాగా జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాబ్‌లోని ముక్తాసార్‌ జిల్లా మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌ పర్యటించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాల నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు. 
 
కార్యాలయాన్ని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. రైతులను చూసి ఎమ్మెల్యే నారంగ్‌ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు పరుగెత్తారు. వారి వెంట రైతులు కూడా వెళ్లారు. 
 
ఎమ్మెల్యే నారంగ్‌పై రైతులు ముప్పేటా దాడి చేశారు. కర్రలు పట్టుకుని వెంటపడ్డారు. దీంతోపాటు ఎమ్మెల్యేపై నల్ల ఇంకు చల్లారు. ఎమ్మెల్యే బట్టలు చింపివేశారు. వెంటనే పోలీసులు కల్పించుకుని రైతులను చెదరగొట్టి వెంటనే ఎమ్మెల్యే నారంగ్‌ను ఓ సెట్టర్‌ లోపలికి పంపించి రక్షించారు. 
 
అనంతరం రైతులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ సందర్భంగా కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనలో రైతులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments