Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసిన బీజేపీ నేతలు.... ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (08:26 IST)
సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పట్టణంలో దారుణం జరిగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు దారుణానికి పాల్పడ్డారు. ఓ ఐఐటీ విద్యార్థిని వివస్త్రను చేసి వీడియో తీసి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం వైరల్ కావడంతో ఆ ముగ్గురు బీజేపీ కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, బహిష్కరణకు గురైన ముగ్గురు బీజేపీ నేతల హోదాను మాత్రం బీజేపీ పెద్దలు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐఐటీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థినని గత యేడాది నవంబర 2వ తేదీ తెల్లవారుజామున లైంగికంగా వేధింపులకు గురైంది. బైకుపై వచ్చిన నిందితులు క్యాంపస్‌లోనే ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ఆమె దుస్తులు విప్పేస్తూ వీడియో తీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. 
 
యూనివర్శిటీ ప్రాంగణంలో భద్రత పెంచాలని కోరింది. ఈ ఘటన యూపీలో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అలాగే, అనేక పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో దిగివచ్చిన బీజేపీ సర్కారు.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు నేతలను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వారణాసి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హన్సరాజ్ విశ్వకర్మ తెలిపారు. నిందితులను కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సాక్ష్యం పటేల్‌గా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం