Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి గుర్తింపు..

lok sabha attack
, గురువారం, 14 డిశెంబరు 2023 (17:56 IST)
పార్లమెంట్‌ దాడి కేసులో ఆరో నిందితుడు, ప్రధాన సూత్రధారిని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఈ దాడికి పాల్పడే ముందు లలిత్ త వద్ద ఉన్న నలుగురు నిందితుల ఫోన్లు తీసుకుని పారిపోయాడు. లలత్ ఝా దాడికి సంబంధించిన ఆనవాళ్లు చెరివేసే అవకాశం ఉందని అంటూనే అతని వద్ద ఉన్న మొబైల్‌లో కుట్రకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నీమ్రూనా సమీపంలో తన సహచరులతో లలిత్ ఝా చివరిగా సమావేశమయ్యాడు. అతడి కోసం పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 
 
కాగా, ఈ దాడి ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటన పార్లమెంట్ భద్రత లోపాన్ని ఎత్తి చూపింది. దీనిపై లోతుగా విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో లలిత్ ఝా ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్నారు. పార్లమెంట్ దాడి కేసులో ఇప్పటివరకు సాగర్ శర్మ, మనోరంజన్ డి, నీలం, అమోల్ అనే నలుగురిని అరెస్టు చేయగా, ఐదో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసులో లలిత్ ఝాని ఆరో నిందితుడిగా గుర్తించి, ఆయన కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంలోకి ప్రవేశించిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్