Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మా స్నేహితుడే.... ఆయన ప్రయత్నం స్వాగతిస్తున్నా : అమిత్ షా

దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ అధినేత అమిత్ షా సానూకూల వ్యాఖ్యలు చేశారు.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (10:07 IST)
దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ అధినేత అమిత్ షా సానూకూల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం స్పందిస్తూ, దేశంలో తృతీయ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని కేసేఆర్ చేస్తున్న ప్రయత్నాలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
 
ముఖ్యంగా అఖండ భారతావనిలో రాజకీయ కూటములను ఏర్పాటు చేసి, కలసికట్టుగా పోటీ చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూటముల ఆధారంగానే ఏర్పడ్డాయని ఆయన గుర్తుచేశారు. 
 
ఇకపోతే, కన్నడ నాట ఎన్నికలపై వస్తున్న సర్వేలను తాము ఎంతమాత్రమూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ రాబోదనీ ఖచ్చితంగా తమ పార్టీ సంపూర్ణ మెజార్టీతో విజయభేరీ మోగిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
అదేసమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా నిప్పులు చెరిగారు. ప్రజలంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని, తమ ఓటుతో వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments