Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఈసీ - ఈసీ నియామకాల నియంత్రణ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (15:37 IST)
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. 'ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు- 2023'ను గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదించింది. 
 
మరోవైపు, ఈ బిల్లుకు రాజ్యసభ ఇప్పటికే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. కొత్త బిల్లు ప్రకారం.. ఇక నుంచీ సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన నిబంధనలు లేవని పేర్కొంటూ.. 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. 
 
ప్రస్తుతమున్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లు ఉందని వివరించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామన్నారు. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలూ ఇందులో పొందుపర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments