Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యతో పరారైన వ్యక్తి భార్యను పెళ్లాడిన బాధితుడు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (10:53 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన ఒకటి జరిగింది. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన భార్యతో పరారైన వ్యక్తి భార్యను బాధిత వ్యక్తి పెళ్లాడాడు. అలా తన భార్యను లేపుకెళ్లి తనకు అన్యాయం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని ఛౌథామ్ బ్లాక్‌లోని హర్దియా గ్రామానికి చెందిన ముకేశ్, నీరజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ముకేశ్ కూలీ పనులు చేస్తుండగా, నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.

వీరిద్దరూ వివాహితులే. నీరజ్‌కు రూబీ దేవితో గత 2009లో వివాహం జరిగింది. అయితే, ఈమెకు ముకేశ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. అంటే వీరిద్దరూ పెళ్లికి ముందు నుంచే ప్రేమ వ్యవహారం సాగింది. వీరిద్దరికీ పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా ప్రేమించుకుంటూ, ఏకాంతంగా కలుసుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఓ రోజున నీరజ్ భార్య, తన ప్రియురాలు రూబీ దేవితో కలిసి ముకేశ్ గ్రామం విడిచి పారిపోయాడు. దీనిపై నీరజ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచాయతీ పెద్దలంతా కలిసి నీరజ్ భార్యను వదిలెయ్యాలని కోరగా, అందుకు ముకేశ్ నిరాకరించాడు. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన నీరజ్.. ముకేశ్ భార్య రూబీ (ఈమె పేరు కూడా రూబీనే)పై కన్నేశాడు. 
 
ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి తనదారికి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజున ముకేశ్ భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం ఈ నెల 18వ తేదీన స్థానిక ఆలయంలో జరిగింది. దీంతో ఈ విషయం ముకేశ్‌కు తెలిసి నిర్ఘాంతపోయాడు. నీరజ్ మాత్రం తన పగ తీర్చుకున్నాననే లోలోపల సంతోషిస్తూ ముకేశ్ భార్య.. కాదు ఇపుడు తన భార్యతో హాయిగా కాపురం చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments