Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచువారింట పెళ్లి సందడి.. మార్చి 3న మనోజ్-మౌనిక వివాహం?

Advertiesment
Manoj
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (10:27 IST)
మంచువారింట పెళ్లి సందడి మొదలైంది. మార్చి 3న మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి వుంటుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. శుక్రవారం పూట వారి పెళ్లి వుంటుందని.. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైనట్లు టాక్ వస్తోంది. 
 
మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరిగే అవకాశాలు వున్నాయి. ఈ మేరకు మహా యంత్ర యాగం జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
మంచు మనోజ్ పెళ్లి సందడిలో భాగంగా ఈ పూజా కార్యక్రమం జరుగుతున్నట్లు  టాక్. ఇందుకోసం కొంతమంది బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు. గత ఏడాది మనోజ్-భూమా మౌనిక గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.  
 
కొన్ని నెలలుగా మనోజ్-మౌనిక అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సహజీవనం చేస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఫైనల్‌గా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ, విభేదాలు రావడంతో 2019లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్‌చరణ్‌కు హెచ్‌.సి.ఎ. అవార్డు దక్కి ఎన్‌.టి.ఆర్‌.కు ఎందుకు దక్కలేదు తెలుసా?