గుజరాత్ రాష్ట్రంలోని మోహసానాలో ఓ వ్యక్తి ఇంటిపై నుంచి రూ.500 నోట్లను ఎదజల్లాలు. ఇవి వర్షాన్ని తలపించింది. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు ఎగబగడ్డారు. తమ కుమారుడిని విహహాన్ని పురస్కరించుకుని జిల్లాలోని కడీ తాలూకాలోని గ్రామంలో ఓ కుటుంబం ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లారు. డాబా నిల్చొన్న వ్యక్తులు ఈ నోట్లను కిందికి విసిరి వేసే వీడియోలు ఉపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
డాబాపై నుంచి నోట్లను కిందికి విసిరివేయడంతో ఆ నోట్లు గాల్లోకి ఎగురుతూ వర్షం కురుస్తున్నట్టుగా కనిపించాయి. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. గాల్లో ఎగురుతున్న నోట్లను పట్టుకునేందుకు జనం పోటీ పడటంతో తోపులాట కూడా జరిగింది.
ఈ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అయిన కరీంబాయి దాదుబాయి జాదవ్ మేనల్లుడు రజక్ వివాహాన్ని పురస్కరించుకుని ఆ కుటుంబ సభ్యులు ఈ నోట్లను వెదజల్లారు. వీరి కుటుంబంలో రజక్ ఒక్కడే మగ సంతానం కావడంతో అతడి పెళ్లి సందర్భంగా ఆనందంతో వారిలా నోట్లను గాల్లోకి విసిరారని చెబుతున్నారు.