దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు 12 చీతాలు చేరుకున్నాయి. గ్వాలియర్ చేరుకున్న ఈ చిరుతలను అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో కూనో పార్కుకు తరలించారు.
ప్రస్తుతం వచ్చిన చీతాలలో ఏడు మగ చీతాలు కాగా, ఐదు ఆడ చీతాలని అధికారులు తెలిపారు.
పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ఎన్‌క్లోజర్లలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని విడుదల చేస్తారు. ఈ ఎన్ క్లోజర్లలో చీతాలను 30 రోజుల పాటు ఉంచి పరిశీలిస్తారు.
గతేడాది సెప్టెంబర్‌లో ఎనిమిది చిరుతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి భారత్‌కు తెప్పించారు.సెప్టెంబర్ 17న వాటిని కూనో నేషనల్ పార్క్ లోని ప్రత్యేక ఎన్ క్లోజర్లలోకి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.