Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త!

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (13:16 IST)
ఆమెను అమితంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఆమె మాత్రం కట్టుకున్న భర్తను కాదని ప్రియుడిని ఇష్టపడింది. దీంతో భర్తే.. తన భార్యను ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇది అచ్చం బాలీవుడ్ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రంలా ఉంది. ఈ సినిమా అచ్చం ఇలానే ఉంటుంది. ఊహించడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ బీహార్‌లో అచ్చంగా ఇదే జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖగారియా జిల్లాకు చెందిన సప్న కుమారి భాగల్‌పూర్‌ జిల్లా సుల్తాన్ గంజ్‌కు చెందిన ఉత్తమ్ మండల్ అనే వ్యక్తిని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉత్తమ్ బంధువు రాజ్‌కుమార్‌ను సప్న కలవక ముందు వరకు వీరి దాంపత్య జీవితం హాయిగానే సాగింది. 
 
రాజ్‌కుమార్‌ను చూడగానే సప్న ప్రేమలో పడిపోయింది. తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతిని మర్చిపోయింది. రాజ్‌కుమార్‌పై మనసు పారేసుకుంది. అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. అతడిని విడిచి ఉండలేకపోయింది. ఈ విషయం తెలిసిన భర్త ఉత్తమ్ భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు.
 
చివరకు ఈ విషయం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు చేరడంతో వారు జోక్యం చేసుకున్నారు. సప్నకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ తాను రాజ్‌కుమార్‌తోనే ఉంటానంటూ ఆమె తేల్చి చెప్పింది. ఆమె నిర్ణయానికి భర్త కూడా అంగీకరించాడు. 
 
దీంతో ఆశ్చర్యపోవడం కుటుంబ సభ్యులవంతైంది. అనుకున్నదే తడవుగా సుల్తాన్‌గంజ్‌లోని దుర్గామాత ఆలయంలో రాజ్‌కుమార్‌తో తన భార్యకు వివాహం జరిపించాడు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments