బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : దూసుకుపోతున్న ఎన్డీయే.. కాంగ్రెస్ - పీకే అడ్రస్ గల్లంతు

ఠాగూర్
శుక్రవారం, 14 నవంబరు 2025 (12:38 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్డీయే కూటమి ఫలితాల్లో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళి మేరకు.. ఎన్డీయే కూటమి ఏకంగా 192 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు. ఆ కూటమి అంతకుమించిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ కూటమి కేవలం 46 స్థానాలకే పరిమితమైంది.
 
ఎన్డీయేలోని కీలక పార్టీలైన భాజపా 80కి పైగా, జేడీయూ 70కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాఘఠ్‌ బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉంది. బీహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
 
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదైంది. పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం మంది ఓటేశారు.
 
తొలి దశ పోలింగ్‌: నవంబరు 6; స్థానాలు: 121; ఓటర్లు: 3.75 కోట్ల మంది; బరిలో నిలిచిన అభ్యర్థులు: 1,314 మంది, నమోదైన పోలింగ్ శాతం: 65+
 
రెండో దశ: నవంబరు 11; సీట్లు: 122; ఓటర్లు: 3.70 కోట్ల మంది; అభ్యర్థులు: 1,302; పోలింగ్ శాతం 69శాతానికి పైగా నమోదైంది. 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్‌ నమోదైంది. దాంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని పార్టీల్లో జేడీయూ (101); భాజపా (101); లోక్‌ జన్‌శక్తి (రాంవిలాస్‌) (28); హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) (06); రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) (06) స్థానాల్లో పోటీ చేశాయి. మఢౌరాలో లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌) అభ్యర్థి సీమా సింగ్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్‌ కుమార్‌కు ఎన్డీయే మద్దతు ప్రకటించింది.
 
మహాఘఠ్‌ బంధన్‌ కూటమిలోని పార్టీల్లో ఆర్జేడీ (143); కాంగ్రెస్‌ (61); సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌ (20); వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (12); సీపీఐ (09); సీపీఎం (04); ఇండియన్‌ ఇన్‌క్లూజివ్‌ పార్టీ (03); జనశక్తి జనతాదళ్‌ (01); స్వతంత్రులు (02) (కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ ఉంది)
 
ఇతరులు: జన్‌ సురాజ్‌ పార్టీ (238); బీఎస్పీ (130); ఆప్‌ (121); ఏఐఎంఐఎం (25); రాష్ట్రీయ లోక్‌జనశక్తి (25); ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం) (25) తదితర పార్టీలు బరిలో ఉన్నాయి.ే
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments