భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి చివరకు విడాకుల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లో ఉంటున్న ఓ 41 ఏళ్ల వ్యక్తికి 2006లో వివాహం జరిగింది. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పెంపుడు కుక్కను ఆ భార్య ఇంటికి తీసుకురావడంతో భర్తకు కష్టాలు మొదలయ్యాయి.
ఎందుకంటే భార్య ఆ కుక్కలను బాగా చూసుకునేది. వాటిని తన బెడ్‌పై పడుకునేపెట్టేది. ఆమె దగ్గరకు భర్తను కూడా కుక్కలు రానీయకుండా కరిచేవి. దీంతో ఇరుగు పొరుగు వారు కూడా ఇబ్బంది పడేవారు. ఇలా వారి నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇక భర్త తట్టుకోలేక 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన భార్య జంతు హక్కుల సంఘంలో చేరిన తర్వాత, ఆమె పదే పదే ఇతరులపై పోలీసు ఫిర్యాదులు చేసిందని, తనకు సహాయం చేయడానికి తనను స్టేషన్లకు పిలిపించిందని, తాను నిరాకరించడంతో తనను దుర్భాషలాడి అవమానించిందని భర్త ఆరోపించాడు.
దీనివల్ల తాను ఒత్తిడికి గురయ్యానని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తాను బెంగళూరుకు వెళ్లిన కూడా తన భార్య తనని ఏదో విధంగా వేధిస్తూనే ఉందని అన్నారు.