Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజు ఆదాయం రూ.500 : రూ.37.5 లక్షల పన్ను బకాయి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:09 IST)
ఆదాయపన్ను శాఖ పంపించిన పన్ను నోటీసుతో ఓ చిరు వ్యాపారి బెంబేలెత్తిపోయాడు. ఈ చిరు వ్యాపారి ఆదాయం రోజుకు రూ.500 మాత్రమే. కానీ, రూ.37.5 లక్షల ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. దీంతో ఆ వ్యాపారి బెదిరిపోయాడు. 
 
బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, రోజుకు రూ.500 సంపాదిస్తున్న ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసును చూసి భయంతో వణికిపోయాడు. దీంతో ఆయన సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
 
గిరీష్‌ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ప్రాథమికంగా ఇది మోసం కేసుగా అనిపిస్తోంది అని అలౌలీ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురేంద్ర కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారు తన పేరు మీద జారీ చేసిన పాన్ నంబర్‌కు ఈ నోటీసులు వచ్చినట్టు తెలిపారు. 
 
గిరీష్ ఢిల్లీలో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నాడని, అక్కడ ఒకప్పుడు టౌట్ ద్వారా పాన్ కార్డు కోసం ప్రయత్నించారని చెప్పాడు. ఎక్కడో తప్పు జరిగడం వల్ల నోటీసు వచ్చిందని తెలిపారు. అంతేకాదు, రాజస్థాన్‌కు చెందిన ఓ కంపెనీతో గిరీష్‌కు సంబంధం ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. 'కానీ అతను ఎప్పుడూ ఆ స్థితికి రాలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments