ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో విధ్వంసం సృష్టించారు.. బీహార్ ఓటర్లకు మంత్రి లోకేశ్ వినతి

ఠాగూర్
ఆదివారం, 9 నవంబరు 2025 (15:57 IST)
బీహార్ ఓటర్లకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ పేరుతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైకాపా నేతలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఈ విషయాన్ని బీహార్ యువత గుర్తుపెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా, బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం మరోమారు ఎన్డీయే కూటమికి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్... అక్కడ విలేకరులతో మాట్లాడుతూ, 'బీహార్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. నీతీశ్‌ సర్కార్‌కు ముందు బీహార్‌లో జంగిల్‌రాజ్‌ ఉండేది. ప్రస్తుతం అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. పాట్నాలో పారిశ్రామికవేత్తలతోనూ మాట్లాడాను. ఇక్కడి అభివృద్ధి పనులు, ప్రభుత్వ విధానంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో అత్యధికంగా బీహార్‌కు నిధులు కేటాయించారు. బీహార్‌ తర్వాత ఏపీకి బడ్జెట్‌లో అధిక నిధులు ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమల రాకతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
 
అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మార్చడం సరికాదు. ప్రభుత్వం మారితే నష్టం జరుగుతుంది. గతంలో ఏపీలో ఒక్క ఛాన్స్‌ పేరుతో ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్‌ యువత మేల్కోవాలి. వికాస్‌ భారత్‌ సాధించాలంటే బీహార్‌ అభివృద్ధి ముఖ్యం. ఇక్కడి యువత, ఓటర్లు మరోసారి ఎన్డీయేను గెలిపించాలి' అని లోకేశ్‌ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments