Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఉద్యోగం ఇప్పిస్తామని క్లినిక్ ముసుగులో?

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (12:13 IST)
ఉద్యోగం ఇస్తానని నమ్మించి మోసం చేసి అమ్మాయిలను వ్యభిచార గృహంలోకి లాగేస్తున్న ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. 
 
క్లినిక్ ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. భోపాల్ నగరంలోని బర్కాహేది ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి.. అదే అదనుగా పెద్దమొత్తంలో ఫీజు చెల్లించాలని ఈ ముఠా చెప్పింది. తాను పేద కుటుంబానికి చెందిన అమ్మాయినని, అంత డబ్బు ఇవ్వలేనని మాయ చెప్పింది. అయితే తమకు తెలిసిన ఓ డేటింగ్ సంస్థ ఉందని, దానిద్వారా ఓ అబ్బాయితో కొద్దిరోజులు డేటింగ్ చేస్తే పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని, దానితో ఫీజు కట్టేయొచ్చని వారు చెప్పారు.
 
అయితే కొద్దీ రోజులు బాగానే ఉన్న ముఠాపై అనుమానం రావడంతో మాయ అక్కడి నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్లాన్ ప్రకారం ఆ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం