Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (13:20 IST)
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లా భివాండి ప్రాంతంలో ఓ పాత భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ శిథిలాల నుంచి 12 మంది సురక్షితంగా రక్షించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతులను నవనాథఅ సావంత్ (40), లక్ష్మదేవి రవి మటో (26), సోనా ముఖేశ్ (5)లుగా ఉన్నారు. 
 
మహారాష్ట్రలోని థానే జిల్లాలో భివాండిలో వర్ధమాన్ కాంపౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో కింద అంతస్తులో పని చేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకు పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 22 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. 
 
మంత్రి కపిల్ పాటిల్, థానె కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments