Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ సూసైడ్ : చిక్కుల్లో కర్నాటక మాజీ మంత్రి!

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (18:26 IST)
తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో కర్నాటకకు చెందిన మాజీ మంత్రి ఒకరు చిక్కుల్లో పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరులోని చంద్రలేఔట్ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన అంజనా వి.శాంతవేరి అనే మహిళ, మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్‌కు రూ.11.88కోట్లు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బును ఇతరుల దగ్గర నుంచి తీసుకొని ఆమె.. ఆయనకు ఇచ్చారు. ఆ తర్వాత సదరు మంత్రి ఈ అప్పును తిరిగి చెల్లించలేదు. 
 
దీంతో ఏమీ చేయాలో పాలిపోని అంజనా.. మాజీ మంత్రిపై అంజన కేసు వేసింది. ఈ కేసు విచారణ జరుగుతుండగా.. మరోవైపు అంజనాకు అప్పుల వారి నుంచి ఒత్తిడి అధికమైంది. తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని వారు ఆమెను డిమాండ్ చేశారు. 
 
ఓ వైపు తాను ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మరోవైపు ఒత్తిళ్లతో భరించలేకపోయిన ఆమె.. ఫ్యాన్‌కు ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన కుమారుడికి ఫోన్ చేసింది. 
 
ఇక ఈ ఘటనపై చంద్రలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన బాబూరావ్ స్వస్థలం కలబుర్గి జిల్లాల చించోళి. ఈయన ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments