Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో దారుణం.. కుమార్తెను హత్య చేసిన టెక్కీ.. కారణం?

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (12:03 IST)
బెంగళూరులో దారుణం జరిగింది. ఉద్యోగం ఊడిపోవడంతో ఓ టెక్కీ తన కుమార్తెను హత్య చేసుకున్నాడు. రెండేళ్ల వయస్సున్న కుమార్తెకు తిండి పెట్టేందుకు డబ్బులేదని.. కుమార్తెను చంపేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన రాహుల్ భార్యాపిల్లలతో కలిసి బెంగళూరులో వుంటున్నాడు. ఆరు నెలల క్రితం రాహుల్‌కు ఉద్యోగం ఊడిపోయింది. 
 
ఇటు బిట్ కాయిన్ బిజినెస్ లోనూ నష్టమొచ్చింది. దీంతో అప్పులపాలైన రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. మూడు రోజుల క్రితం కూతురుతో కలిసి బయటకు వెళ్లిన రాహుల్.. తిరిగి రాలేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఆపై సిటీ శివార్లలోని ఓ చెరువు దగ్గర రాహుల్ కారు కనిపించింది. ఆ చెరువులో రాహుల్ కూతురు మృతదేహం బయటపడింది.
 
విచారణలో రాహుల్ తన కూతురును చంపేసినట్లు తేలింది. డబ్బులేకపోవడంతో కూతురుకు తిండిపెట్టలేనని భావించి హత్యకు పాల్పడినట్లు రాహుల్ చెప్పినట్లు పోలీసులు వివరించారు. తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినా విఫలమైనట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments