Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ మూవీలో ఉన్నది తన భార్యేనని భావించి హత్య చేసిన భర్త

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:41 IST)
పోర్న్ మూవీలు చూసే అలవాటు ఉన్న ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. తాను చూసిన పోర్న్ మూవీలో ఉన్న మహిళ అచ్చం తన భార్యలాగే ఉండటంతో ఆ చిత్రంలో తన భార్యే నటించివుంటుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో డ్రైవరుగా పని చేస్తున్నారు. ఈయనకు పోర్న్ మూవీస్ చూసే అలవాటు ఉంది. అయితే, రెండు నెలల క్రితం ఓ పోర్న్ మూవీ చూశాడు. అందులో ఉన్న మహిళ తన భార్యేనన్న అనుమానం కలిగింది. దీంతో అప్పటి నుంచి ఆమెను వేధించసాగాడు. 
 
నిజానికి ఈ ఆటో డ్రైవర్‌కు వివాహమై 15 యేళ్లు అయింది. ఐదుగురు సంతానం కూడా ఉన్నారు. అయితే పోర్న్ మూవీస్ చూడటానికి అలవాటుపడిన జహీర్ పాషా తాను చూసిన చిత్రంలో ఉన్న మహిళ తన భార్యేనని గుడ్డిగా నమ్మి ఆమెను చిత్ర హింసలకు గురిచేయసాగాడు. 
 
ఈ క్రమంలో గత ఆదివారం భార్యతో గొడవపడిన పాషా.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. అది చూసిన పెద్ద కుమారుడు తాతకు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించారు. వారంతా ఇంటికి వచ్చి చూసే సమయానికి ఆమె విగతజీవిగా పడివుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం