సినీ నటుడు, మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ డానిష్ ఓపెన్‌లో అదరగొట్టాడు. డెన్మార్క్ ఓపెన్ 2022, స్విమ్మింగ్ విభాగంలో వేదాంత్ మాధవన్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
తన కుమారుడు మెడల్ గెలుచుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కుమారుడు రజత పతకాన్ని సాధించడంపై మాధవన్ హర్షం వ్యక్తం చేశాడు. తన కుమారుడు మన దేశం గర్వించేలా చేశాడంటూ కామెంట్ జత చేశాడు.
ఇంకా దేశానికి వన్నె తెచ్చిన వేదాంత్ మాధవన్ కు సెలబ్రెటీలు, నెటిజన్లు, శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ నటి శిల్పాశెట్టి, నమ్రతాశిరోద్కర్, ఇషా డియోల్, రోహిత్‌లతో పాటు అనేక మంది నెటిజన్లు, ఫాలోవర్లు వేదాంత్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇకపోతే కోపెన్ హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ 2022 పోటీల్లో వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకాన్ని గెలుచుకున్నారు. 15:57:86 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.