Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలల్లో మత్తు పదార్థం కలిపి... ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన తనయ

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (17:50 IST)
సాధారణంగా పిల్లలను చంపిన తల్లిదండ్రులను చూశాం. కానీ, ఇక్కడ కన్నతండ్రిని హత్య చేసిందో బాలిక. ఆ బాలిక వయసు 15 యేళ్లు మాత్రమే. పాల్లలో మత్తు పదార్థాలిచ్చి ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసింది. ఈ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన ఓ వస్త్ర వ్యాపారి(41)కి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే 15 ఏళ్ల వయసున్న బాలిక ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. తన బిడ్డను మందలించాడు. ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. 
 
దీంతో తండ్రిపై కూతురు పగ పెంచుకుంది. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో తన ప్రియుడితో కలిసి తండ్రిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపింది. ఆ తర్వాత బాత్‌రూంలో పడేసి నిప్పు పెట్టి వారిద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఈ ఘటనలో వస్త్ర వ్యాపారి కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన అమ్మ, సోదరుడు కలిసి పుదుచ్చేరికి పెళ్లికి వెళ్లారని.. ఈ క్రమంలో తాను అల్పాహారం తీసుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లాను అని చెప్పింది. ఏం జరిగిందో తనకు తెలియదు అని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది. 
 
మొత్తానికి ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో చేసిన నేరాన్ని అంగీకరించింది. తన తండ్రికి పాలల్లో మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత ఆయన స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపాను. అనంతరం డెడ్‌ బాడీని బాత్‌రూంలోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించామని పూసగుచ్చినట్టు వివరించింది. తనను మా నాన్న కొట్టినందుకే హత్య చేశానంటూ బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో ఆమెతో పాటు.. ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments