తెలుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానాన్ని దారి మరణించారు. ప్రతికూల వాతావరణంతో విమానాన్ని బెంగుళూరుకు తరలించారు. ఆ తర్వాత గురువారం ఆర్థరాత్రి 1.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు ఆయన చేరుకున్నారు.
గురువారం సాయంత్రం తన కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి రాత్రి 7.30 గంటల సమయంలో విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే వాతావరణంలో ఉన్నట్టుండి అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా బెంగుళూరుకు తరలించారు.
ఈ విమానం రాత్రి 9.20 గంటలకు బెంగుళూరుకు చేరుకుంది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో రాత్రి 10.30 గంటల సమయంలో బెంగుళూరు నుంచి బయలుదేరి అర్థరాత్రి దాటాక హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అంటే చంద్రబాబు ప్రయాణించిన విమానం నిర్ణీత సమయం కంటే 7 గంటలు ఆలస్యంగా అర్థరాత్రి 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.