Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా?

Advertiesment
మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా?
, గురువారం, 6 జూన్ 2019 (18:42 IST)
గత వారం ట్విటర్‌లో ట్రెండ్ అయిన ‘#ఆర్గాజంఇనీక్వాలిటీ’ హ్యాష్‌టాగ్‌ నా దృష్టిని ఆకర్షించింది. కండోమ్ తయారుచేసే ఒక కంపెనీ భావప్రాప్తి అసమానత(ఆర్గాజం ఇనీక్వాలిటీ) క్యాంపైన్ గురించి ఇటీవల చేసిన ప్రకటన వల్ల నటి స్వర భాస్కర్ వివాదాల్లో పడ్డారు. కానీ ఈ విషయం భారత్‌లో మహిళల లైంగిక ఆరోగ్యం, లైంగిక సమానత్వానికి సంబంధించి చాలా ప్రశ్నలు రేకెత్తేలా చేసింది.
 
నిజానికి 'ఆర్గాజం ఇనీక్వాలిటీ' గురించి మాట్లాడిన స్వర భాస్కర్ ఒక ప్రాయోజిత సర్వే వివరాలను ప్రస్తావిస్తూ "భారత్‌లో దాదాపు 70 శాతం మంది మహిళలు సెక్స్ సమయంలో ఆర్గాజం వరకూ చేరుకోవడం లేదని" అన్నారు. స్వర భాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత వెంటనే రెండు విషయాలు జరిగాయి.
 
మొదటిది ట్విటర్-ఫేస్‌బుక్‌ సహా ఆమె అన్ని సోషల్ మీడియా వాల్స్‌లో దారుణమైన కామెంట్లతోపాటు 'సెక్సిస్ట్ ట్రోలింగ్‌' ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండోది అదే సోషల్ మీడియాలో భారత్‌లో మొదటిసారి 'ఆర్గాజం ఇనీక్వాలిటీ' లాంటి తీవ్రమైన, అవసరమైన అంశంపై చర్చ మొదలైంది. మరోవైపు మహిళలు ఈ అంశాన్ని సోషల్ మీడియాలో లేవనెత్తడాన్ని 'సాహసం, ధైర్యం' నుంచి 'ఆందోళన, విషాదం, బాధ'గా కూడా చెప్పారు. ఇంకోవైపు ఈ సమస్య గురించి 'గౌరవప్రదం'గా మాట్లాడేందుకు అవసరమైన పదాలు కూడా లేవని భావించారు.
 
గత వారం నుంచీ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ఎపిసోడ్‌తో 'ఆర్గజం ఇనీక్వాలిటీ'పై మాట్లాడ్డానికి భారత దేశం సిద్ధంగా ఉందా? అనే ఒక ప్రశ్న గురించి అయితే స్పష్టంగా తెలిసింది. ఈ కఠిన ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్న నేను గత పదేళ్లుగా లండన్ నుంచీ లఖ్‌నవూ, లఖీసరాయ్ వరకూ నా మహిళా మిత్రులతో ఎప్పుడు మాట్లాడినా దాని గురించి ప్రస్తావించాను. నాకొకటి గుర్తొచ్చింది. 2016లో అక్టోబర్‌లో నేను ఒక సాయంత్రం నా స్నేహితురాలితో ఆఫీసు కింద లంచ్ చేస్తూ న్యూస్ పేపర్ తిరగేస్తున్నప్పుడు హఠాత్తుగా షాక్ అయ్యాను.
 
తర్వాత ఆమె నాకు ఒక వార్తను చూపిస్తూ నాతో "భార్య భర్తతో చాలా కాలం పాటు సెక్స్‌కు ఒప్పుకోకపోవడం 'క్రూరత్వం' అని సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చిందని, విడాకులు అడగడానికి దానిని ఆధారంగా చూపవచ్చని పేర్కొందని" చెప్పింది. "మహిళ పురుష భాగస్వామికి కుదరదని చెప్పడం క్రూరత్వం అయినపుడు, పురుష పార్ట్‌నర్ ఏళ్ల పాటు తన మహిళా సహచరి 'ఆర్గాజం' గురించి పట్టించుకోకపోతే, అదేంటి. అది 'క్రూరత్వం' కాదా" అని ఆమె వ్యంగ్యంగా నవ్వుతూ నన్ను అడిగింది.
 
రాబోవు కాలంలో మొత్తం ఒక శతాబ్దమంతా మహిళల లైంగికత కేవలం పిల్లల్ని కనడానికి ముడిపెట్టే చూస్తారని 19వ శతాబ్దంలో మొట్ట మొదట స్త్రీ సెక్సువాలిటీని 'క్రియారాహిత్యం'తో జోడించిన డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ బహుశా అనుకుని ఉండరు. కానీ 2019కి వస్తే భారత్‌లో నాతోపాటూ పుట్టి పెరిగి, ఉద్యోగాలు, వేర్వేరు వృత్తుల్లో ఉన్న మహిళలంతా స్త్రీ క్రియారహిత్యానికి సంబంధించిన ఆలోచనలను 'ఫ్యూడల్ పురుషుల ఊహలు'గా చెప్పారు. చాలా విషయాల్లో తమ తోటి పురుష సహచరుడు తమ శక్తితో మ్యాచ్ కాలేకపోతున్నారన్నారు.
 
వివాహిత, నా పాత స్నేహితురాలు ఒకరు దీనిని 'పితృస్వామిక' ఆలోచనకు సంబంధించినదని చెప్పారు. ఒక యువతి సెక్స్ పట్ల కాస్త ఆసక్తి చూపించినా, ఆమెను జన్మజన్మలకూ ప్రేమిస్తున్నానని చెప్పే ఆమె ప్రియుడే మొట్టమొదట అనుమానంగా చూస్తాడు. ఇంకోవైపు ప్రేమలో 26 కళలున్నాయని చెబుతూ పురుషుడు బెడ్రూంలో 'మాచో' అయిపోతాడు. అదే స్త్రీ ఒక్క 'ఆర్గజం' గురించి అడిగితే మాత్రం ఆమెను వెంటనే 'స్లట్‌'గా ప్రకటించేస్తారు.
 
ఆమె నాతో.. "మనం నోర్మూసుకుని మన శరీరాలను సెక్స్ కోసం పురుషులకు సమర్పిస్తూ ఉండాలి. కుటుంబం అనుమతితో వాళ్లు ఎంతమంది అంటే, అంత మంది పిల్లల్ని కంటూ ఉండాలని భారత సమాజంలో కోరుకుంటారు. అక్కడ మనల్ని ఒక పిల్లల్ని కనే యంత్రంలా అనుకోకుండా ఒక మనిషిగా కాస్త సుఖం కోరుకుంటే మాత్రం అంతా కలిసి మనపై పిడుగుల్లా విరుచుకుపడతారు" అన్నారు.
 
చాలా కాలం పాటు సంతృప్తి లేని వైవాహిక జీవితం గడిపిన తర్వాత కష్టంగా విడాకులు తీసుకున్న ఒక మహిళ నాతో "స్త్రీలు ఎక్కువ కాలంపాటు లైంగిక నిర్లక్ష్యానికి గురైతే దానిని కూడా చట్ట ప్రకారం విడిపోయేందుకు ఆధారంగా చూడాలి" అన్నారు. "స్త్రీ-పురుషుల మధ్య సంబంధాలను బ్లాక్ అండ్ వైట్ బైనరీలో చూడకూడదు. అది చాలా సున్నితమైన, జటిలమైన ఒక గ్రే స్పేస్. పైగా భారత్‌లో మహిళల మానసిక స్థితి ఏళ్ల తరబడి శారీరక సుఖం లేకపోయినా, సంప్రదాయాన్ని గౌరవిస్తూ విఫలమైన వివాహ బంధంలో గడిపేలా ఉంటుంది. పిల్లల్ని కంటూనే ఉంటుంది. కానీ తన సుఖం కోసం మాత్రం ఆమె ఎప్పటికీ నోరు తెరవదు".
 
- ప్రియాంకా దూబే
బీబీసీ ప్రతినిధి

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్న క్యాంటీన్ల నోట్లో అడ్డంగా పచ్చి వెలక్కాయ్... మూతపడుతున్నాయ్...