Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెదేపా ముగ్గురు ఎంపీలు భాజపాలోకి జంప్...? ఆ ఎంపితో బాబు ఏకాంతంగా.. ఎందుకు?

Advertiesment
తెదేపా ముగ్గురు ఎంపీలు భాజపాలోకి జంప్...? ఆ ఎంపితో బాబు ఏకాంతంగా.. ఎందుకు?
, గురువారం, 6 జూన్ 2019 (10:14 IST)
తెలుగుదేశం పార్టీ ఎపిలో గెలుచుకుంది మూడు ఎంపి సీట్లే. పార్టీ అసలు ఉంటుందా అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లోనే కలిగింది. కానీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్‌కు నచ్చజెప్పి ఎవరూ అధైర్యడొద్దండి అంటూ చెప్పారు. ప్రస్తుతానికి అది బాగానే ఉన్నా టిడిపిలో వలసలు ప్రారంభమైనట్లు స్పష్టంగా కనబడుతోందంటున్నారు విశ్లేషకులు. టిడిపి విజయవాడ ఎంపిగా గెలిచిన కేశినేని నాని బిజెపి నేతలతో బాగా టచ్‌లో ఉన్నారు. అంతేకాదు బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు.
 
టిడిపిలో నిన్న విప్ పదవి ఇస్తే వద్దని సున్నితంగా తిరస్కరించారు కేశినేని నాని. ఇది కాస్తా రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. ఎంపి గల్లా జయదేవ్ మధ్యవర్తిత్వంతో చివరకు చర్చలకు కూర్చున్నారు. మరోవైపు చంద్రబాబు ఏకాంతంగా కేశినేని నానితో మాట్లాడారు. గంట పాటు వీరిద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. పార్టీ ఇచ్చిన పదవిని తీసుకోవాలని చంద్రబాబు కేశినేని నానికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నాని మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారట. 
 
దీంతో చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయారట. మరోవైపు బిజెపి నేతలతో బాగా టచ్‌లో ఉన్నారట  కేశినేని నాని. టిడిపిలో ఉన్న ముగ్గురు ఎంపిలను తమవైపు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బిజెపి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న ప్రధాని మోదీ...