Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతి స్నేహితునికి దగ్గరైందని.. హెల్మెట్‌తో దాడి

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (13:06 IST)
ప్రేమించిన యువతి తనకు దూరమై.. స్నేహితునికి దగ్గర కావడంతో జీర్ణించుకోలేక పోయిన యువకుడు ఆమెపై హెల్మెట్‌తో దాడికి పాల్పడ్డాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో వారింటికి ఫోన్ చేసి ఆమెకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి అసలు విషయం తెలియడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని నెలమంగల సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బబిత్ అనే యువకుడు 21 ఏళ్ల యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిమధ్య మనస్పర్థలు రావడంతో యువతి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రియుడి స్నేహితుడైన రాహుల్‌కు దగ్గరైంది. యువతి రాహుల్ ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన యువకుడు వారిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న హెల్మెట్‌తో ఆమెపై దాడిచేశాడు.
 
గాయాలపాలైన యువతి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె ఇంటికి ఫోన్ చేసిన బబిత్, ఆమెకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తమ కుమార్తెపై దాడి జరిగిందని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బబిత్, రాహుల్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments